Page Loader
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 189 పరుగులు
ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన టీమిండియా

నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 189 పరుగులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2023
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. మొదటగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించలేదు. మొదటి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్(5)ను మహ్మద్ సిరాజ్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా స్కోరును పరిగెత్తించాడు. 65 బంతుల్లో పది ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 81 బంతులు చేశాడు. స్టీవ్ స్మిత్‌తో కలిసి మిచెల్ మార్స్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. స్టీవ్ స్మిత్ (22) హర్ధిక్ పాండ్యా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అనంతరం చకచకా ఆస్ట్రేలియా వికెట్లు పడిపోయాడు.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలం

లబుషన్ (15), జోష్ (26) గ్రీన్(12) మాత్రమే రెండెక్కల స్కోరును చేశాడు. మిగతా బ్యాట్ మెన్స్ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా 2, కుల్దీప్ యాదవ్, హర్ధిక్ పాండ్యా తలో ఒకో వికెట్ తీశారు. టీమిండియా విజయానికి 189 పరుగులు అవసరం