టీమిండియా, ఆస్ట్రేలియా వన్డే సమరానికి సర్వం సిద్ధం
భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను ఓడిన ఆస్ట్రేలియా.. టీమిండియాతో వన్డే సమరానికి సిద్ధమైంది. శుక్రవానం నుంచి మొదటి వన్డేలో టీమిండియాను ఆస్ట్రేలియా ఢీకొట్టనుంది. ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1 భారత్ కైవసం చేసుకుంది. టీమిండియాకు హార్ధిక్ పాండ్యా, ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ఈనెల 17న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండనుంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకొనే అవకాశం ఉంటుంది. ఈ పిచ్ 27 మ్యాచ్‌లు జరగ్గా.. ఛేజింగ్ జట్లు 14 సార్లు గెలుపొందాయి. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో 1:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇరు జట్లలోని ఆటగాళ్లు
పాట్ కమిన్స్ వన్డే సిరీస్ నుండి తప్పుకోవడంతో స్టీవ్ స్మిత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. స్మిత్ 2018లో చివరి సారిగా వన్డేలకు నాయకత్వం వహించాడు. అనివార్య కారణాల వల్ల రోహిత్ శర్మ మొదటి వన్డేకు దూరమవ్వగా.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో ఆస్ట్రేలియాపై 2,083 పరుగులు చేశాడు. వన్డేలో స్టీవ్ స్మిత్ భారత్‌పై 1,123 పరుగులు చేశాడు. భారత్ : శుభ్‌మన్ గిల్, ఇషాన్‌కిషన్, విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్‌యాదవ్, కేఎల్‌రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), జడేజా, మాలిక్, సిరాజ్, షమీ, కుల్దీప్‌యాదవ్ ఆస్ట్రేలియా : డేవిడ్‌వార్నర్, ట్రావిస్‌హెడ్, స్టీవ్‌స్మిత్ (కెప్టెన్), మిచెల్‌మార్ష్, మాక్స్‌వెల్, స్టోనిస్, అలెక్స్ కారీ (వికెట్-కీపర్), కామెరాన్ గ్రీన్, అష్టన్‌అగర్, ఆడమ్‌జంపా, మిచెల్‌స్టార్క్