Page Loader
భారత్‌తో జరిగే వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. కెప్టెన్‌గా స్మిత్
వన్డేలకు కెప్టెన్‌గా నియమితులైన స్టీవ్ స్మిత్

భారత్‌తో జరిగే వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. కెప్టెన్‌గా స్మిత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2023
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. టీమిండియా చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా ప్రస్తుతం వన్డే సమరానికి సిద్ధమైంది. టెస్టుల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. రెండో టెస్టులో గాయపడిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు అందుబాటులోకి వచ్చాడు. మడమ గాయంతో టెస్టులకు దూరమైన మిచెల్ మార్ష్ కూడా వన్డేలకు అందుబాటులోకి వచ్చినట్టు కోచ్ తెలిపాడు మార్చి 17 నుంచి 22 వ‌ర‌కు వ‌న్డే సిరీస్ జ‌రుగ‌నుంది. తొలి వ‌న్డేకు ముంబాయిలోని వాంఖ‌డే స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా వ‌న్డే జ‌ట్టు ఇదే

గాయంతో బాధపడుతున్న మరో ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ మాత్రం వన్డేలకు దూరమయ్యాడు. మరో ఆటగాడు జే రిచర్డ్‌సన్ ఇంకా కోలుకోకపోవడంతో నాథన్ ఎల్లిస్‌కు స్థానం దక్కింది. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. స్మిత్ (కెప్టెన్‌), సీన్ అబాట్‌, ఆస్ట‌న్ అగ‌ర్‌, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్‌, ట్రావిస్ హెడ్‌, జోష్ ఇంగ్లీస్‌, మార్క‌స్ ల‌బుషేన్‌, మిచెల్ మార్ష్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, రిచ‌ర్డ్‌స‌న్‌, స్టార్క్‌, స్టోయినిస్‌, ఆడ‌మ్ జంపా, డేవిడ్ వార్న‌ర్‌