IND vs AUS: పాపం ట్రావిస్ హెడ్.. సెంచరీ మిస్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో బాగా రాణించాడు. హెడ్ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ ఉస్మాన్ ఖవాజా గాయపడ్డాడు. అయితే ఖావాజా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు. దీంతో ట్రావిస్ హెడ్ తో కలిసి కునెమన్ (6) బ్యాటింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐదో రోజు ఆటలో కునెమన్ అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అనంతరం లబుషేన్‌తో కలిసి ట్రావిస్‌హెడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు జాగ్రత్తగా మరో వికెట్ పడకుండా ఆడాడు. అయితే శతకానికి చేరువగా వచ్చిన హెడ్‌ను అక్షర్‌పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
డ్రాగా ముగిసిన చివరి టెస్టు
తన 36వ టెస్టు ఆడుతున్న హెడ్ 45.4 సగటుతో 2,361 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఐదు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలను బాదాడు. అత్యధికంగా టెస్టుల్లో 175 పరుగులు చేశాడు. టీమిండియాపై మూడో అర్ధసెంచరీని నమోదు చేయడం విశేషం. ఈ సిరీస్‌లో హెడ్ వరుసగా 32, 9, 49*, 12 , 43 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 78.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మ్యాచ్ ఫలితం వచ్చేది అనుమానంగా ఉండటంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.