Page Loader
IND VS AUS: ఉస్మాన్ ఖావాజా వీర విజృంభణ
422 బంతుల్లో 180 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా

IND VS AUS: ఉస్మాన్ ఖావాజా వీర విజృంభణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2023
06:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో ఉస్మాన్ ఖావాజా చెలరేగిపోయాడు. 422 బంతుల్లో 180 (21 ఫోర్లు) పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 450 మార్కును దాటింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రస్తుతం ఉస్మాన్ ఖావాజా అరుదైన ఫీట్ ను చేరుకున్నాడు. ఆస్ట్రేలియా తరుపున టీమిండియాపై మూడోవ అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ఖావాజా రికార్డుకెక్కాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ట్రావిస్‌హెడ్‌తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు ఖావాజా 61 పరుగులు జోడించారు. కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (39)తో కలిసి 79 పరుగులు చేశారు. అనంతరం కామెరాన్‌గ్రీన్ (114)తో కలిసి ఏకంగా డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు.

ఖావాజా

ఖావాజా సాధించిన రికార్డులివే

యాషెస్ 2019 తర్వాత ఖవాజా గతేడాది జనవరిలో మళ్లీ టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు.అప్పటి నుంచి మంచి ఫామ్‌ను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖవాజా ఆస్ట్రేలియా తరుపున తొలి సెంచరీని చేశాడు. ఖవాజా భారత గడ్డపై 150కి పైగా టెస్టు స్కోరును సాధించిన నాలుగో ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నిలిచాడు. ఖవాజా 60 టెస్టు మ్యాచ్‌ల్లో 47.82 సగటుతో 4495 పరుగులు చేశారు. ఇందులో 14 సెంచరీలు, 21 సెంచరీలను బాదాడు ఖవాజా, గ్రీన్ ఐదో వికెట్‌కు 208 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత గడ్డపై టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం.