IND vs AUS: సెంచరీతో మెరిసిన కామెరాన్ గ్రీన్
భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు చక్కగా రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. రెండో రోజుల ఆటలో ఆసీస్ బ్యాటర్లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. కామెరాన్ గ్రీన్ తన కెరీర్‌లో మొట్టమొదటి సెంచరీని నమోదు చేశాడు. దీంతో భారత పర్యటనలో తొలి సెంచరీ చేసిన ఆరో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా గ్రీన్ రికార్డుకెక్కాడు. మరో ఎండ్‌లో ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి అజేయంగా 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.
టెస్టుల్లో మొట్టమొదటి సెంచరీ సాధించిన కామెరాన్ గ్రీన్
కామెరాన్ గ్రాన్ 20 టెస్టులు మ్యాచ్ లు ఆడి 941 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలున్నాయి. బౌలింగ్ విభాగంలో 21 వికెట్లను పడగొట్టాడు. భారత్‌తో ఆడిన ఆరు టెస్టుల్లో 350 పరుగులకు పైగా చేశాడు. గతేడాది డిసెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో గ్రీన్ చేతికి గాయమైంది. దీంతో తొలి టెస్టులకు గ్రీన్ దూరమయ్యాడు. మూడో టెస్టులో 21 పరుగులు చేసిన గ్రీన్.. ఎలాంటి వికెట్ తీసుకోలేదు. ఉస్మాన్ ఖావాజా భారత్ పై 150 పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియా ఓపెనర్‌గా నిలిచాడు. అంతకముందు 2001లో ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ భారత్‌తో జరిగిన చెన్నై టెస్టులో 203 పరుగులు చేశాడు.