IND vs AUS : మొదటి రోజు సెంచరీతో కదం తొక్కిన ఉస్మాన్ ఖావాజా
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా అధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా (251 బంతుల్లో 104 బ్యాటింగ్; 15 ఫోర్లు) శతకంతో చెలరేగాడు. కెమరూన్ గ్రీన్ (64 బంతుల్లో 49 బ్యాటింగ్; 8 ఫోర్లు) రాణించాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది ఉస్మాన్ ఖావాజా టెస్టులో తన 14వ సెంచరీని నమోదు చేశాడు. మహ్మద్ షమీ రెండు, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
బ్యాటర్లకు అనుకూలంగా పిచ్
ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖావాజా ఆరంభం నుంచే పరుగులు చేయడం మొదలు పెట్టారు. గత మూడు టెస్టులకు విభిన్నంగా నాలుగో టెస్టు పిచ్ ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఫోర్లతో విరుచుకుపడ్డారు. అదే సమయంలో భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ పలు క్యాచ్ లను నేలపాలు చేశాడు చివరి 9 ఓవర్లలో ఆస్ట్రేలియా ఓవర్ కు 7 కంటే ఎక్కువగా పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ లో ఖవాజాకు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.