
IND Vs AUS : స్టీవ్ స్మిత్‌కే చివరి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి 9న ఆహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా జట్టుని కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ పగ్గాలను అందుకోనున్నాడు. ఢిల్లీ టెస్టు ముగియగానే స్వదేశానికి వెళ్లిపోయిన పాట్ కమిన్స్.. ఇంకా ఇండియాకి తిరిగి రాలేదు. భారత్‌తో జరిగే నాలుగో టెస్టు ఆడలేనని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పినట్లు సమాచారం.
కమిన్స్ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతను స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు.
మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించడంతో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిరీస్ 2-1 తేడాతో టీమిండియా ముందంజలో ఉంది.
స్టీవ్ స్మిత్
2015లో టెస్టు పగ్గాలను అందుకున్న స్టీవ్ స్మిత్
పాట్ కమిన్స్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకు 15 టెస్టుల్లో నాయకత్వం వహించాడు. ఇందులో ఎనిమిది విజయాలు, మూడు ఓటములు, నాలుగు డ్రాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో 21.22 సగటుతో 53 వికెట్లను సొంతం చేసుకున్నాడు.
మైఖేల్ క్లార్క్ అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత 2015లో స్మిత్ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 37 టెస్టులకు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించి 21 విజయాలను అందించాడు. ఇందులో 10 ఓటములు, ఆరు డ్రాలు ఉన్నాయి.
2013 ప్రారంభం నుండి భారత్ స్వదేశంలో కేవలం మూడు టెస్టుల్లో ఓడిపోయింది. వీటిలో రెండు పరాజయాలను స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా నమోదు చేసింది. ఇండియా 2017 పుణే, 2013 ఇండోర్‌లో ఓడిపోయింది.