WTC: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా
ఇండోర్ టెస్టు గెలిచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలని టీమిండియా ప్రయత్నించింది. కానీ ఈ పోరులో ఆస్ట్రేలియా గెలిచి తొలుత చోటు దక్కించుకుంది. రెండు టెస్టులలో ఘోర ఓటముల తర్వాత పుంజుకున్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో టీమిండియా ని 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఒకవేళ ఆసీస్ పై నాలుగో టెస్టులో టీమిండియా గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరే అవకాశం ఉంది. లేకపోతే శ్రీలంక రూపంలో టీమిండియాకు గండం పొంచివుంది. మూడో టెస్టు గెలుపుతో ఆసీస్ 68.52 పాయింట్లతో ఛాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది టీమ్‌ఇండియా ప్రస్తుతం 60.29 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
కివీస్‌పై శ్రీలంక 2-0తేడాతో గెలిస్తే భారత్ కు నో ఛాన్స్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మాథ్యూ కుహ్నెమాన్ (5/16) అద్భుతమైన బౌలింగ్‌తో చేయడంతో భారత జట్టు 109 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా తరుపున ఉస్మాన్ ఖవాజా 60 రాణించడంతో ఆస్ట్రేలియా 197 పరుగులు చేసింది. నాథన్ లియోన్ 8/64తో రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగడంతో భారత్ 163 పరుగులకు అలౌటైంది. 76 పరుగుల ఛేదనకు దిగిన ఆసీస్.. తొమ్మిది వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. కివీస్‌పై లంక 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి.. టీమ్‌ఇండియా నాలుగో టెస్టులో ఓడితే మాత్రం టీమిండియా ఆశలు గల్లంతు అయినట్లే. అప్పుడు శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.