Page Loader
IND vs AUS: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
చివరి టెస్టు అహ్మదాబాద్ స్టేడియంలో జరగనుంది.

IND vs AUS: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2023
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న టీమిండియా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కాలంటే భారత్ నాలుగో టెస్టు ఖచ్చితంగా గెలవాల్సిందే. మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్టు జరగనుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగుసార్లు విజయం సాధించింది. ఆరు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 2021లో ఈ వేదికపై భారత్ ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడింది. ఈ టెస్టులో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో 9:30 గంటలకు ప్రసారం కానుంది.

టీమిండియా

ఇరు జట్లలోని సభ్యులు

ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పటి వరకు 105 టెస్టుల్లో తలపడింది. ఇందులో భారత్ 32 మ్యాచ్‌ల్లో నెగ్గింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 53 టెస్టుల్లో భారత్ 23 విజయాలు, 14 ఓటములను కలిగి ఉంది. ఆస్ట్రేలియా చివరిసారిగా 2014-15లో భారత్‌పై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్‌శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్‌కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్-కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్‌పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్. ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్‌స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్-కీపర్), మిచెల్‌స్టార్క్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ లియాన్.