టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం..!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాట్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి గాయం కారణంగా ఆఖరి రోజుకు ఆటకు దూరమయ్యాడు. మూడో రోజు ఫీల్డింగ్ చేస్తూ వెన్నునొప్పితో పెవిలియన్ చేరిన శ్రేయాస్ అయ్యర్‌ని అఖరి టెస్టు ఆఖరి రోజు నుంచి తప్పినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
అయ్యర్ గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అయ్యర్ హెల్త్ గురించి సరైన అప్‌డేట్ ఇవ్వకపోవడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తరుపున పదిమంది బ్యాటర్లే బ్యాటింగ్ చేశారు.
అయితే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్, ఐపీఎల్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.
శ్రేయాస్ అయ్యర్
సూర్యకుమార్ యాదవ్‌కి లైన్ క్లియర్..!
జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. అతని స్థానంలో రజత్ పాటిదార్‌ని బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కి కూడా దూరమైనట్టు సమాచారం. ఇదే నిజమైతే వన్డే ఫార్మాట్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి మరో అవకాశం దొరికినట్టు అవుతుంది.
అయ్యర్ గాయం కోలుకోవడానికి మరింత సమయం కావాలిన వైద్యులు సూచిస్తే, ఐపీఎల్ 2023 సీజన్‌కి కూడా అతను దూరం కావచ్చు.