Page Loader
మైనర్‌పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 
Sandeep Rape case: మైనర్‌పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

మైనర్‌పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు 

వ్రాసిన వారు Stalin
Dec 30, 2023
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో దిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు దోషిగా తేలడం సంచలనంగా మారింది. నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచ్చనే మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ మేమరకు జస్టిస్ శిశిర్ రాజ్ ధాకల్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖాట్మండులోని హోటల్ గదిలో అత్యాచారానికి పాల్పడినట్లు 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేయడంతో గతేడాది ఆగస్టులో సందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జనవరిలో నేపాల్ కోర్టు విడుదల చేసింది. నేపాల్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ఆడిన తొలి క్రికెటర్ లామిచ్చనే కావడం గమనార్హం. ఐపీఎల్‌లో 2018లో దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి అరంగేట్రం చేశాడు.

నేపాల్

లెగ్ స్పిన్, ప్రమాదకరమైన గూగ్లీలతో ' లామిచ్చనే' విశేష గుర్తింపు 

సందీప్ లామిచ్చనే కెరీర్ ప్రారంభించిన అనతి కాలంలోనే విశేష గుర్తింపు పొందాడు. తన లెగ్ స్పిన్, ప్రమాదకరమైన గూగ్లీలతో ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, వెస్టిండీస్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన T20 లీగ్‌లలో లామిచ్చనే చాలా ప్రజాదరణ పొందిన క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా, టీ20 ఇంటర్నేషనల్‌లో మూడో ఫాస్టెస్ట్ 50 వికెట్లు తీసిన ఆటగాడిగా లామిచానే రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఆగస్టులో కెన్యాతో జరిగిన టీ20లో చివరిసారిగా ఆడాడు. మైనర్ బాలికను శారీరకంగా, మానసికంగా హింసించారనే నేరాల్లో లామిచానే‌ దోషిగా తేలాడు.