LOADING...
Sanju Samson: కోహ్లిని గుర్తు చేసిన సంజూ సిక్సర్‌.. గంభీర్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌!
కోహ్లిని గుర్తు చేసిన సంజూ సిక్సర్‌.. గంభీర్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌!

Sanju Samson: కోహ్లిని గుర్తు చేసిన సంజూ సిక్సర్‌.. గంభీర్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ సంజు శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకోలేకపోయాడు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కింది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సంజూను ఓపెనర్‌గా పంపించింది. క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన అతడు 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే భారత ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టింది మాత్రం సంజూనే. భారీ సిక్సర్‌తో స్కోరు బోర్డును తెరిచాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌ మీదుగా అద్భుతమైన సిక్సర్‌ బాది ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు.

Details

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఆ షాట్‌కు మైదానంలోని వారందరూ ఫిదా అయ్యారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉన్న హెడ్‌కోచ్‌ గౌతమ్ గంభీర్ సైతం ఆశ్చర్యంతో స్పందించినట్లు కనిపించింది. ఈ సిక్సర్‌ 2022 టీ20 ప్రపంచకప్‌లో హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఐకానిక్‌ సిక్సర్‌ను గుర్తు చేసిందంటూ అభిమానులు సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement