LOADING...
Sanju Samson: ఆసియా కప్ ముందు సంజూ శాంసన్ సెంచరీ.. సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్
ఆసియా కప్ ముందు సంజూ శాంసన్ సెంచరీ.. సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్

Sanju Samson: ఆసియా కప్ ముందు సంజూ శాంసన్ సెంచరీ.. సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాలో తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి, వస్తున్న విమర్శలకు భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌సంజు శాంసన్‌ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఆసియా కప్ సమీపిస్తున్న వేళ, కేరళ క్రికెట్ లీగ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ, కేవలం 42 బంతుల్లోనే విధ్వంసక సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి సెలక్టర్ల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆదివారం ఏరీస్‌ కొల్లం సెయిలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొచ్చి బ్లూ టైగర్స్ తరఫున ఆడిన సంజూ, ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు బాదుతూ పరుగుల వర్షం కురిపించాడు.

Details

51 బంతుల్లో 121 పరుగులు

మొత్తంగా 51 బంతుల్లో 121 పరుగులు చేసి అద్భుత శతకాన్ని నమోదు చేసి జట్టుకు భరోసానిచ్చాడు. ఇక ఆసియా కప్‌కు వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ తిరిగి జట్టులోకి రానుండటంతో, సంజూ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. గిల్‌తో పాటు అభిషేక్‌ శర్మను ఓపెనర్లుగా ఆడించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు సంజూను మిడిలార్డర్‌లో ఆడించవచ్చని, లేక పూర్తిగా పక్కన పెట్టవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఓపెనర్‌గా వచ్చి శతకం బాదడం అతనికి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

Details

సెప్టెంబర్‌ 10న యూఏఈతో టీమిండియా పోటీ

ఇటీవలే సంజూ, మిడిలార్డర్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాడు. కేరళ లీగ్‌లోని గత మ్యాచ్‌లో ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేసినప్పటికీ, 22 బంతులు ఆడి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ వైఫల్యం తర్వాత తిరిగి ఓపెనర్‌గా వచ్చి మెరుపు శతకంతో తన సత్తా చాటడం విశేషం. కాగా సెప్టెంబర్‌ 10న యూఏఈతో టీమిండియా ఆసియా కప్ ప్రస్థానాన్ని ఆరంభించనుంది. అనంతరం సెప్టెంబర్‌ 14న పాకిస్థాన్‌తో కీలక పోరులో తలపడనుంది.