Sanju Samson Net Worth 2026 : సంజూ శాంసన్ నికర ఆస్తి.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్.. రాజభవనం లాంటి ఇల్లు..!
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ సెమీస్‌కి అడుగుపెట్టింది. ఈ విజయంలో సంజూ శాంసన్ (Sanju Samson) కీలక పాత్ర పోషించాడు. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చూపించాడు. 50 బంతులలో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయం తో 97 పరుగులు చేసి జట్టు కోసం అజేయంగా నిలిచాడు. దీనిపై సోషల్ మీడియా వేదికల్లో సంజూ శాంసన్ కోసం ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే, అభిమానులు అతడి ఆస్తి విలువపై ఆసక్తి చూపుతున్నారు. అనేక నివేదికల ప్రకారం 2026 నాటికి సంజూ శాంసన్ నికర ఆస్తి 85-100 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
Details
తన
ఐపీఎల్ జీతం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజులు, ఎండార్స్‌మెంట్ డీల్స్ అతడి ప్రధాన ఆదాయ వనరులు. ప్రస్తుతం సంజూ శాంసన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో గ్రేడ్ సిలో ఉన్నాడు. ఈ కాంట్రాక్టు ప్రకారం అతకు ఏడాదికి కోట్లు రూపాయల జీతం లభిస్తుంది. అదనంగా, మ్యాచ్ ఫీజులు కూడా ఉంటాయి: టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు. ఐపీఎల్ ద్వారా సంజూ శాంసన్‌కు భారీ ఆదాయం లభిస్తోంది. 2025 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అతనికి రూ.18 కోట్లు జీతంగా ఇచ్చింది. 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అతనికి అదే మొత్తాన్ని జీతంగా చెల్లించనుంది.
Details
కేరళ విజింబంలో .6 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు
సంజూ శాంసన్ అనేక ప్రఖ్యాత బ్రాండ్స్‌కు ఎండార్స్‌మెంట్ డీల్స్‌లో ఉన్నాడు. జిలెట్, భారత్‌పే, ప్యూమా, ఎస్‌జీ వంటి బ్రాండ్స్‌తో ఒప్పందాల ద్వారా ఒక్కో డీల్‌కు సుమారు రూ.25-40 లక్షలు లాభపడతాడు. లగ్జరీ కార్ల విషయంలో కూడా అతడి ఆసక్తి ఎక్కువ. అతని కలెక్షన్‌లో రేంజ్ రోవర్ స్పోర్ట్, BMW 5 సిరీస్, ఆడి A6, మెర్సిడెస్-బెంజ్ C-క్లాస్ ఉన్నాయి. ఇల్లు విషయంలో, కేరళ విజింబంలో అతనికి రూ.6 కోట్ల విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. అంతేకాదు, బెంగళూరు, ముంబై, హైదరాబాదు వంటి నగరాల్లో కూడా అతనికి ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుంది.