LOADING...
#SankranthiSpecial: సంక్రాంతి స్పెషల్‌.. తీపి వంటకాలకు బెల్లమే బెస్ట్‌ చాయిస్‌!
సంక్రాంతి స్పెషల్‌.. తీపి వంటకాలకు బెల్లమే బెస్ట్‌ చాయిస్‌!

#SankranthiSpecial: సంక్రాంతి స్పెషల్‌.. తీపి వంటకాలకు బెల్లమే బెస్ట్‌ చాయిస్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, పిండి వంటల సువాసనలతో గ్రామాలు-పట్టణాలు ఉత్సవ వాతావరణంతో కళకళలాడుతాయి. అయితే ఈ సంబరాల్లో మనం తినే తీపి వంటకాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెల్ల చక్కెరతో చేసిన వంటలకంటే, సంప్రదాయంగా బెల్లంతో తయారు చేసే పదార్థాలే ఆరోగ్యానికి మేలని వారు స్పష్టం చేస్తున్నారు. బెల్లం కేవలం తీపిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు. ఇందులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు మాత్రమే కాకుండా, భాస్వరం, జింక్, సెలీనియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా బెల్లంలో లభిస్తాయి.

Details

రక్తహీనతను తగ్గించడంలో సాయపడుతుంది

విటమిన్లు మెండుగా ఉండటంతో ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతూ, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అందుకే మన పెద్దలు పండుగ వంటల్లో చక్కెర కంటే బెల్లానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. శీతాకాలంలో వచ్చే సంక్రాంతి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. బెల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఇందులోని క్యాల్షియం, భాస్వరం ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి. ఎదిగే పిల్లలు, వృద్ధులు బెల్లంతో చేసిన వంటలు తీసుకుంటే వారి శారీరక దృఢత్వం మరింత మెరుగవుతుంది.

Details

చక్కెరను తగ్గించాలి

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, బెల్లం సహజ శుద్ధి కారిణిగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, ప్రేగులు, రక్తంలో చేరిన మలినాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరచడంలో ఇది దోహదపడుతుంది. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. కాబట్టి ఈ సంక్రాంతికి చక్కెరను తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడే బెల్లంతో పిండి వంటలు తయారు చేసుకుని పండుగను మరింత ఆనందంగా జరుపుకుందాం.

Advertisement