
IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ జావేద్ మియాందాద్ 2024 వెర్షన్: సంజయ్ మంజ్రేకర్
ఈ వార్తాకథనం ఏంటి
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సర్ఫరాజ్ దుమ్ములేపుతున్నాడు.
శుబ్‌మన్ గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన 26 ఏళ్ల ముంబైకర్, మూడో రోజు ఆటలో తన సత్తా చాటాడు.
సర్ఫరాజ్ భారత పోరాటంలో కీలక పాత్ర పోషించాడు.స్వీప్, ర్యాంప్ షాట్లతో అలరిస్తూ, క్రీజులో కుదురుగా అడూతూ అలరించాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి సర్ఫరాజ్ ఖాన్ 70 పరుగులతో అజేయంగా నిలిచాడు.
నాలుగో రోజు భారత్ తమ రిథమ్ కొనసాగించాలంటే,సర్ఫరాజ్ క్రీజులో ఎక్కువ సేపు ఉండడం అవసరం.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సర్ఫరాజ్‌ను పొగిడారు.
వివరాలు
2024 మియాందాద్ వెర్షన్
సర్ఫరాజ్‌ను భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ జావేద్ మియాందాద్‌తో పోల్చారు.
"సర్ఫరాజ్ నాకు జావేద్ మియాందాద్‌ని గుర్తు చేస్తున్నాడు. 1980లలో మియాందాద్ ఇదే తరహాలో ఆడేవాడు. సర్ఫరాజ్ 2024 మియాందాద్ వెర్షన్ లాంటివాడు. అతని ఆటతీరు నాకు చాలా బాగా నచ్చింది. అతను స్పిన్ బౌలింగ్‌నే కాదు, ఫాస్ట్ బౌలింగ్‌ను కూడా అద్భుతంగా ఆడుతున్నాడు, ఇది ఆశ్చర్యకరం," అని మంజ్రేకర్ పేర్కొన్నారు.
మూడో రోజు ఆట ముగిసే సమయంలో తన వికెట్‌ను రక్షించుకోవడంలో సర్ఫరాజ్ దిట్ట అని మంజ్రేకర్ అన్నారు.
"నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ క్రీజులో ఉండటం భారత్‌కు చాలా కీలకం. సర్ఫరాజ్ బౌన్సర్లను అద్భుతంగా ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇది భారత జట్టుకు శుభపరిణామం అని" ఆయన వ్యాఖ్యానించారు.