Page Loader
Virat Kohli Record: ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు 
Virat Kohli Record: ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డు

Virat Kohli Record: ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు 

వ్రాసిన వారు Stalin
Nov 19, 2023
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియా జట్టుపై 3పరుగులు చేసిన అనంతరం ఆస్ట్రేలియా దిగ్గజం పాంటింగ్‌ను విరాట్‌ వెనక్కి నెట్టి ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో(1,744) ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 45మ్యాచ్‌లలో 44ఇన్నింగ్స్‌లలో 56.95 సగటుతో 88.98స్ట్రైక్ రేట్‌తో 2,278పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాంటింగ్ మూడో స్థానంలో (1,743), శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర నాలుగో స్థానంలో (1,532), భారత కెప్టెన్ రోహిత్ శర్మ 5వ స్థానంలో (1,528*) ఉన్నారు.

విరాట్

ఈ ప్రపంచకప్‌లో విరాట్‌ గణాంకాలు

ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ 85 పరుగుల చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై 55 పరుగులు, పాకిస్తాన్‌పై 16 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై 103*, న్యూజిలాండ్‌పై 95 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై డకౌట్ అయ్యి నిరాశ పర్చాడు. శ్రీలంకపై 88, దక్షిణాఫ్రికాపై 101*, నెదర్లాండ్స్‌పై 51 పరుగులు చేశాడు. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై 117 పరుగులతో అదరగొట్టాడు. ఈ సెంచరీతోనే వన్డేల్లో తన 50వ సెంచరీని విరాట్ కోహ్లీని అందుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ 49 సెంచరీల రికార్డును అధిగమించాడు.