Shreyas Iyer :న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు అరుదైన ఘనత అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో వన్డే మ్యాచ్ బుధవారం (జనవరి 14) రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. 2017లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు 74 మ్యాచ్‌లు ఆడాడు. 68 ఇన్నింగ్స్‌ల్లో 47.8 సగటుతో 2966 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో ఐదు శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి.
Details
రెండో స్థానంలో విరాట్
రాజ్‌కోట్ వన్డేలో శ్రేయస్ అయ్యర్ 34 పరుగులు చేస్తే వన్డేల్లో 3 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అంతేకాదు, భారత జట్టు తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించే అవకాశముంది. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. ధావన్ 72 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకోగా, విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.
Details
వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
శిఖర్ ధావన్ - 72 ఇన్నింగ్స్‌లు విరాట్ కోహ్లీ - 75 ఇన్నింగ్స్‌లు కేఎల్ రాహుల్ - 78 ఇన్నింగ్స్‌లు నవజ్యోత్ సిద్ధూ - 79 ఇన్నింగ్స్‌లు సౌరవ్ గంగూలీ - 82 ఇన్నింగ్స్‌లు అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న ప్రపంచ రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆయన కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. షై హోప్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్‌లు 67 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా, బాబర్ ఆజామ్ 68 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేశాడు.