Loading...
ZIM vs IND: జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్ శర్మపై వేటు?.. ప్రభ్‌సిమ్రన్‌కు ఛాన్స్ దక్కేనా!
జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్ శర్మపై వేటు?.. ప్రభ్‌సిమ్రన్‌కు ఛాన్స్ దక్కేనా!

ZIM vs IND: జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్ శర్మపై వేటు?.. ప్రభ్‌సిమ్రన్‌కు ఛాన్స్ దక్కేనా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

జింబాబ్వేపై తొలి టీ20లో అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న భారత జట్టు, అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. హరారె వేదికగా నేడు జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో మరోసారి విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

వివరాలు

అభిషేక్ శర్మపై వేటు?

ప్రభ్‌సిమ్రన్‌కు ఛాన్స్ రెండో టీ20లో భారత జట్టులో ఒక కీలక మార్పు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచడంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం.

అతడి స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఈ మార్పుతో జట్టుకు కుడిచేతి-ఎడమచేతి బ్యాటర్ల కాంబినేషన్ కూడా లభించనుంది.

వివరాలు

వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు

తొలి టీ20లో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

తొలి మ్యాచ్‌లో చూపిన అదే దూకుడును రెండో టీ20లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు లేవు

ఓపెనింగ్‌లో మార్పు మినహా మిగతా బ్యాటింగ్ క్రమంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రానున్నారు.

మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే తమ స్థానాలను కొనసాగించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

అదే బౌలింగ్ కాంబినేషన్‌తో భారత్

తొలి టీ20లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగి విజయాన్ని అందుకున్న భారత జట్టు, రెండో మ్యాచ్‌లో కూడా అదే బౌలింగ్ కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

వరుసగా రెండో విజయాన్ని అందుకుని సిరీస్‌ను ముందుగానే ఖాయం చేయాలనే లక్ష్యంతో టీమ్ ఇండియా నేటి మ్యాచ్‌కు సిద్ధమైంది.

ADVERTISEMENT