LOADING...
IND vs SA : గౌహతిలో రెండో టెస్టు.. అరుదైన రికార్డుకు చేరువలో కెప్టెన్ బవుమా!
గౌహతిలో రెండో టెస్టు.. అరుదైన రికార్డుకు చేరువలో కెప్టెన్ బవుమా!

IND vs SA : గౌహతిలో రెండో టెస్టు.. అరుదైన రికార్డుకు చేరువలో కెప్టెన్ బవుమా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సఫారీలు 1-0 ఆధిక్యంలో ఉన్నారు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా టీమిండియాపై విజయం సాధించింది. ఇక రెండో టెస్టు నవంబర్ 22వ తేదీ శనివారం నుంచి గౌహతిలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను ఒక అరుదైన రికార్డు సమీపిస్తోంది. ఈ రెండో టెస్టులో బవుమా 31 పరుగులు చేస్తే, దక్షిణాఫ్రికా తరఫున కెప్టెన్‌గా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు అతడు కెప్టెన్‌గా 11 టెస్టుల్లో ఆడి 57 సగటుతో 969 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్థశతకాలు ఉన్నాయి.

Details

దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితా  

బవుమా నాయకత్వంలో ఇప్పటి వరకు సఫారీలు 10 టెస్టుల్లో గెలుపొందగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. గ్రేమ్‌ స్మిత్ - 8647 పరుగులు హాన్సీ క్రోన్జే - 2833 పరుగులు ఫాఫ్ డు ప్లెసిస్ - 2219 పరుగులు హెచ్‌డబ్ల్యూ టేలర్ - 1487 పరుగులు ఎడి నూర్స్ - 1242 పరుగులు టిఎల్ గొడ్దార్డ్ - 1092 పరుగులు