U-19 asia cup: విజృంభించిన సెహ్వాగ్ కుమారుడు.. నేపాల్‌పై భారత్ అద్భుత విజయం
ఈ వార్తాకథనం ఏంటి
అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయగా.. ఆ తర్వాత బ్యాటర్లు ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని ఛేదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 42.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ అద్భుతంగా రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు.
వివరాలు
హాఫ్ సెంచరీతో రాణించిన ఆర్యవీర్ సెహ్వాగ్
అర్జున్ రాజ్‌పుత్, యశ్‌వీర్ గౌడ్ తలో రెండు వికెట్లు తీసి నేపాల్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు.
అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 19.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా విజయాన్ని అందుకుంది.
ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్, లక్ష్య రాజేశ్ అజేయ అర్ధశతకాలతో జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ 70 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. మరో ఓపెనర్ లక్ష్య రాజేశ్ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు.
దీంతో భారత యువ జట్టు అండర్-19 ఆసియా కప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.