Brian Bennett: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. 3 ఇన్నింగ్స్‌ల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచిన బ్రియాన్ బెన్నెట్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టీ20లో లీగ్ దశ ముగిసింది. శనివారం (ఫిబ్రవరి 21) నుంచి సూపర్-8 పోరాటాలు ప్రారంభం కానున్నాయి. ఈ దశకు పసికూనగా భావించిన జింబాబ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో అర్హత సాధించింది. బలమైన ఆస్ట్రేలియాపై గెలుపు సాధించడంతో అది కేవలం గాలివాటం విజయం అనుకున్నారు. కానీ ఆతిథ్య శ్రీలంకను కూడా ఓడించి తమ విజయాలు యాదృచ్ఛికం కాదని నిరూపించింది. ఇప్పుడు సూపర్-8లోనూ మరోసారి సంచలనాలకు సిద్ధమవుతోంది. లీగ్ దశలో జింబాబ్వే విజయాల్లో యువ బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ కీలక పాత్ర పోషించాడు. ఈ వరల్డ్‌కప్‌లో అతడు అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన బెన్నెట్ ఒక్కసారి కూడా ఔట్ కాలేదు.
Details
జట్టు విజయంలో కీలక పాత్ర
ఒమెన్‌పై 48 నాటౌట్, ఆస్ట్రేలియాపై 64 నాటౌట్, శ్రీలంకపై 63 నాటౌట్ ఇన్నింగ్స్‌లు ఆడి మొత్తం 175 పరుగులు నమోదు చేశాడు. ముఖ్యంగా ప్రతి మ్యాచ్‌లో చివరి వరకూ నిలబడి జట్టును విజయానికి చేరువ చేయడం అతని ప్రత్యేకతగా నిలిచింది. అతడి సగటు అద్భుతంగా ఉండడంతో ఈ మెగా టోర్నీలో అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. బెన్నెట్ ఆటలో కనిపిస్తున్న పరిపక్వత, ఒత్తిడిలోనూ వికెట్ కాపాడే తీరు, మ్యాచ్‌ను చివరి వరకూ ముగించే ధోరణి అతడిని భవిష్యత్ స్టార్‌గా నిలబెడుతున్నాయి.
Details
ఇలాగే రాణిస్తే సెమీఫైనల్ కి చేరే అవకాశాలు ఎక్కువ
కేవలం పరుగులు చేయడమే కాకుండా మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా ఆడడం అతని ఎదుగుదలకు నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఈ వరల్డ్‌కప్‌లో బెన్నెట్ ప్రదర్శన జింబాబ్వే జట్టుకు పెద్ద బలంగా మారింది. ఇదే ఫామ్ కొనసాగితే కీలక మ్యాచ్‌ల్లో జింబాబ్వే విజయాలు సాధించే అవకాశాలు మెరుగవుతాయి. జట్టు సెమీఫైనల్ చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.