Rohit Sharma: ఐపీఎల్‌లో ముంబయికి ఎదురుదెబ్బ.. పంజాబ్ మ్యాచ్‌కు రోహిత్ డౌటే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముంబయి బ్యాటర్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొడ కండరాల గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. త్వరలో అతను స్కానింగ్ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. రిపోర్టుల్లో గాయం తీవ్రంగా ఉందని తేలితే పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
వివరాలు
రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడిన రోహిత్
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ప్రారంభానికి ముందు రోహిత్ ఇబ్బందిగా కనిపించాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ ఓవర్‌లో రెండో బంతిని ఎదుర్కొన్న తర్వాత అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. అనంతరం తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. ఆ మ్యాచ్‌లో ముంబయి 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 137 పరుగులు చేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులతో జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు.