అంతర్జాతీయ క్రికెట్ కు షబ్మిమ్ ఇస్మాయిల్ గుడ్‌బై
సౌతాఫ్రికా ప్లేయర్స్ లో అత్యుత్తమ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది. క్రికెట్ సౌతాఫ్రికా మే3న ఈ విషయాన్ని వెల్లడించింది. ICC మహిళల T20 వరల్డ్ కప్ 2023లో SA రన్నరప్‌గా నిలవడంలో ఇస్మాయిల్ కీలక పాత్ర పోషించింది. అయితే ఆమె టీ20 ఫ్రాంచైసీలతో కొనసాగనుంది. 2007లో ఇస్మాయిల్ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటివరకూ 127 వన్డేల్లో 191 వికెట్ల పడగొట్టింది. ఇందులో ఆరు సార్లు నాలుగు వికెట్లను సాధించింది. భారత్‌కు చెందిన ఝులన్ గోస్వామికి వన్డే ఫార్మాట్లో 255 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. 68 వన్డే మ్యాచ్‌లలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్ గా ఆమె నిలిచింది
ఇస్మాయిల్ సాధించిన రికార్డులివే
నవంబర్ 2011లో ఆమె నెదర్లాండ్స్‌పై 6/10 విజృంభించిన విషయం తెలిసిందే. వన్డేల్లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా కూడా ఆమె రికార్డు సృష్టించింది. ఆమె పోట్చెఫ్‌స్ట్రూమ్‌లోని సెన్‌వెస్ పార్క్‌లో 3.77 ఎకానమీ వద్ద 24 వికెట్లు తీసింది. ఉమెన్స్ టీ20ల్లో113 మ్యాచ్ లు ఆడి 5.77 ఎకానమీతో 123 వికెట్లను తీసింది. వన్డే ప్రపంచ కప్‌లో 25 మ్యాచ్ లు ఆడి 4.33 ఎకానమీతో 36 వికెట్లు తీసింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డునూ కూడా ఇస్మాయిల్ సాధించింది. మహిళల క్రికెట్ చరిత్రలో 128 కిలోమీటర్ల వేగంతో బంతులను విసిరే సామర్థ్యం ఇస్మాయిల్ కి ఉంది.