LOADING...
Shafali Verma: షఫాలీ వర్మకు ICC "ప్లేయర్ ఆఫ్ ది మంత్" అవార్డు
షఫాలీ వర్మకు ICC "ప్లేయర్ ఆఫ్ ది మంత్" అవార్డు

Shafali Verma: షఫాలీ వర్మకు ICC "ప్లేయర్ ఆఫ్ ది మంత్" అవార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే వరల్డ్ కప్ (ICC Womens ODI World Cup) ఫైనల్‌లో అసాధారణ ప్రదర్శన ఇచ్చిన షఫాలీ వర్మ (Shafali Verma)ను నవంబర్ నెలకు ఐసీసీ (ICC) "ప్లేయర్ ఆఫ్ ది మంత్"గా నామినేట్ చేసింది. సెమీఫైనల్ ముందు ప్రతికా రావల్ గాయపడటంతో, అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షఫాలీ మొదటి మ్యాచ్‌లో కొంత విఫలమయ్యింది. కానీ, దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో ఆమె 78 బంతుల్లో 87 పరుగులు చేసి తన ప్రతిభ చూపించింది. బంతితోనూ సత్తా చాటుతూ, కీలకమైన రెండు వికెట్లు తీసి జట్టుకు మద్దతుగా నిలిచింది. ఇలా షెఫాలీ వర్మ తన ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో రాణించి.. టీమ్‌ఇండియా తొలిసారి విశ్వవిజేతగా అవతరించడంలో కీలకంగా నిలిచింది.

వివరాలు 

15 వికెట్లు సాధించిన తిపట్చా పుట్టావాంగ్

ఇప్పటివరకు, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కోసం షఫాలీ వర్మతో పాటు యూఏఈకి చెందిన ఈషా ఓజా, థాయిలాండ్ కి చెందిన తిపట్చా పుట్టావాంగ్ కూడా నామినేట్ అయ్యారు. ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ సందర్భంగా, ఓజా మ్యాచ్ విజేతగా నిలిచి, ఏడు టీ20ల్లో 137.50 స్ట్రైక్ రేట్‌తో 187 పరుగులు చేసింది. బంతితో కూడా రాణించింది. 18.14 సగటుతో 7 వికెట్లు తీసింది. అలాగే, థాయ్‌లాండ్ నుండి వచ్చిన ఎడమచేతి వాటం స్పిన్నర్ తిపట్చా పుట్టావాంగ్ ఆ టోర్నమెంట్‌లో 15 వికెట్లు సాధించింది.

Advertisement