LOADING...
chess: భారత్‌కు మరో గర్వకారణం.. చెస్‌లో రికార్డు బ్రేక్ చేసిన మూడేళ్ల బుడ్డోడు
భారత్‌కు మరో గర్వకారణం.. చెస్‌లో రికార్డు బ్రేక్ చేసిన మూడేళ్ల బుడ్డోడు

chess: భారత్‌కు మరో గర్వకారణం.. చెస్‌లో రికార్డు బ్రేక్ చేసిన మూడేళ్ల బుడ్డోడు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడుేళ్ల వయసులోనే చెస్‌లో అద్భుతం చేసి భారత్‌కు పేరు తీసుకొచ్చాడు సరవగ్య సింగ్ కుష్వాహా. కేవలం మూడేళ్లు ఏడు నెలలు 20రోజులు వయసులోనే అధికారికంగా ఫిడే రేటింగ్ పొందిన అత్యంత పిన్న వయస్కుడైన చెస్ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత్‌కే చెందిన అనిష్ సర్కార్ పేరిట ఉండేది. ఆయన నవంబర్‌లో మూడేళ్లు ఎనిమిది నెలలు 19రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. మధ్యప్రదేశ్‌లో నర్సరీ చదువుతున్న సరవగ్య ప్రస్తుతం 1,572ర్యాపిడ్ రేటింగ్ సాధించాడు. ఫిడే రేటింగ్ పొందాలంటే కనీసం ఒక ఫిడే రేటింగ్ ఉన్న ఆటగాడిని ఓడించాల్సి ఉంటుంది. రేటింగ్ అనేది క్రీడాకారుడి ప్రదర్శన ఆధారంగా అతడి సామర్థ్యాన్ని కొలిచే పాయింట్ల సంఖ్య మాత్రమే,ర్యాంకింగ్ కాదని ఫిడే వివరించింది.

వివరాలు 

మూడు ఫిడే రేటింగ్ ఉన్న ఆటగాళ్లను ఓడించి రికార్డు

ర్యాపిడ్ చెస్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న మాగ్నస్ కార్ల్సెన్‌కు ప్రస్తుతం 2,824 రేటింగ్ ఉంది. ఈ అరుదైన ఘనతపై సరవగ్య తండ్రి సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ, "నా కుమారుడు ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ఫిడే రేటింగ్ సాధించడం మా కుటుంబానికి అపారమైన గర్వకారణం. అతడు గ్రాండ్‌మాస్టర్ కావాలని మా ఆశ" అన్నారు. సరవగ్య రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన టోర్నమెంట్లలో మూడు ఫిడే రేటింగ్ ఉన్న ఆటగాళ్లను ఓడించి ఈ రికార్డు సాధించాడు. చెస్ గ్రాండ్‌మాస్టర్ల పుట్టినిల్లు లాంటి భారత్ ఇప్పటికే విశ్వనాథన్ ఆనంద్ వంటి దిగ్గజాలను, తాజాగా ప్రపంచ చాంపియన్ గుకేశ్ దోమ్మరాజును తయారుచేసిన సంగతి తెలిసిందే.

Advertisement