LOADING...
Stock market: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock market: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతం లాభాలతో ముగిశాయి. సూచీలు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయినా, ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రకటించడం మార్కెట్‌ను ఊరట ఇచ్చింది. అదనంగా, రూ.1.45 లక్షల కోట్ల విలువైన బాండ్ల కొనుగోలు ద్వారా లిక్విడిటీని పెంచే నిర్ణయం సూచీలకు మరింత సహాయకమైంది. దీంతో సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 85,125.48 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 85,265.32) నష్టాలతో ప్రారంభమైంది. ఆర్‌ బి ఐ ప్రకటన వెంటనే లాభాల్లోకి మారింది. రోజంతా లాభాలే కొనసాగిస్తూ, ఇంట్రాడేలో 85,796.72 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.

వివరాలు 

రూపాయి-డాలర్ మారకం విలువ 89.99గా నమోదు 

చివరగా 447.05 పాయింట్ల లాభంతో 85,712.37 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 152.70 పాయింట్ల లాభంతో 26,186.45 వద్ద స్థిరపడింది. రూపాయి-డాలర్ మారకం విలువ 89.99గా ఉంది. సెన్సెక్స్ 30లో ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు, హిందుస్థాన్ యూనిలీవర్, ఎటెర్నల్, టీఎంపీవీ, సన్‌ఫార్మా, ట్రెంట్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా, బ్రెంట్ క్రూడ్ ధర 63.10 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 4223 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement