NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2024: కోల్‌కతా-హైదరాబాద్ మధ్య మ్యాచ్ .. క్షమించమన్న షారుక్ ఖాన్ .. ఎందుకంటే..? 
    తదుపరి వార్తా కథనం
    IPL 2024: కోల్‌కతా-హైదరాబాద్ మధ్య మ్యాచ్ .. క్షమించమన్న షారుక్ ఖాన్ .. ఎందుకంటే..? 
    కోల్‌కతా-హైదరాబాద్ మధ్య మ్యాచ్ .. క్షమించమన్న షారుక్ ఖాన్ .. ఎందుకంటే..?

    IPL 2024: కోల్‌కతా-హైదరాబాద్ మధ్య మ్యాచ్ .. క్షమించమన్న షారుక్ ఖాన్ .. ఎందుకంటే..? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2024
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య మంగళవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో షారుక్ ఖాన్ జట్టు కెకెఆర్ అద్భుత విజయం సాధించింది.

    ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో ఇది తొలి క్వాలిఫయర్ మ్యాచ్, ఇందులో గెలిచి కోల్‌కతా జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది.

    ఈ బిగ్ మ్యాచ్ చూసేందుకు షారుక్ ఖాన్ పిల్లలు సుహానా, అబ్రామ్ కూడా వచ్చారు. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత, కింగ్ ఖాన్ క్షమాపణలు చెప్పాడు.

    ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత దానిపై చర్చ జరుగుతుందన్నవిషయం మనకు తెలుసు. లైవ్ లో మ్యాచ్‌లను సమీక్షిస్తుంది, ఆటగాళ్లతో మాట్లాడుతుంది, మ్యాచ్‌లోని వివిధ అంశాలపై నిపుణుల అభిప్రాయాలను కూడా అందిస్తుంది.

    Details 

    షారుక్ చేతులు జోడించి క్షమాపణలు 

    KKR,SRH మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా, లైవ్ షో జరుగుతోంది.దీని షూటింగ్ గ్రౌండ్‌లో జరుగుతోంది.

    ఇందులో ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్, సురేశ్ రైనా మాట్లాడుతున్నారు. అదే సమయంలో షారుఖ్ తెలియకుండా ఓ తప్పు చేశాడు.

    ఆకాష్ చోప్రా,పార్థివ్ పటేల్,సురేష్ రైనా మాట్లాడుతున్నప్పుడు, ప్రేక్షకుల వైపు చెయ్యి ఊపుతూ షారుక్ ఖాన్ అనుకోకుండా వారి మధ్యకు చేరుకున్నాడు.

    అతను కెమెరా ఫ్రేమ్ మధ్యలోకి వచ్చాడు. వెంటనే షారుక్‌కి తేరుకొని ఆపై చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు.

    ఈ సంఘటనను చూసిన సుహానా,అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు నవ్వడం మొదలుపెట్టారు.

    షారుక్ ఖాన్ వెంటనే ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్,సురేష్ రైనాలను కూడా కౌగిలించుకున్నాడు. ఈ విషయంపై ఆకాష్ ట్వీట్ కూడా చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా నైట్ రైడర్స్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కోల్‌కతా నైట్ రైడర్స్

    షకీబ్ అల్ హసన్ ప్లేస్‌లో జాసన్ రాయ్‌ను తీసుకున్న కేకేఆర్ ఐపీఎల్
    కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా? క్రికెట్
    IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా? ఐపీఎల్
    శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025