Asian Games 2026: ఆసియా క్రీడల్లో షాక్.. స్పృహ తప్పి పడిపోయిన భారత అథ్లెట్
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు (Asian Games)లో భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్ వరుణ్ సన్యాల్ (Varun Sanyal) అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో అతడు క్రూయిజ్ షిప్‌లో స్పృహ తప్పి పడిపోయినట్లు ఎంఎంఏ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు నిఖిల్ కుందేరా వెల్లడించారు. వరుణ్ సన్యాల్ క్రూయిజ్ షిప్‌లో స్పృహ కోల్పోయి పడిపోవడాన్ని నేపాల్‌కు చెందిన ఓ అథ్లెట్ గమనించాడు. వెంటనే ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో వరుణ్‌ను ఆస్పత్రికి తరలించారు.
వివరాలు
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం
ప్రస్తుతం వరుణ్ సన్యాల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నిఖిల్ కుందేరా తెలిపారు.
అయితే అనారోగ్యానికి గురైన కారణంగా అతడు ఆసియా క్రీడల్లోని క్వార్టర్‌ఫైనల్ నుంచి డిస్‌క్వాలిఫై అయినట్లు సమాచారం.
ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే వరుణ్ సన్యాల్ అస్వస్థతకు గురికావడంతో అతడి పోటీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.