LOADING...
Thailand Open Final 2026: థాయిలాండ్ ఓపెన్ ఫైనల్‌లో భారత జోడీకి షాక్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న సాత్విక్‌-చిరాగ్
థాయిలాండ్ ఓపెన్ ఫైనల్‌లో భారత జోడీకి షాక్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న సాత్విక్‌-చిరాగ్

Thailand Open Final 2026: థాయిలాండ్ ఓపెన్ ఫైనల్‌లో భారత జోడీకి షాక్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న సాత్విక్‌-చిరాగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి జోడీ అద్భుత ప్రదర్శనతో థాయిలాండ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ.. తుది పోరులో నిరాశ ఎదురైంది. ఇండోనేషియా ద్వయం లియో రోలీ కర్నాండో - డానియల్ మార్తిన్ చేతిలో భారత జోడీ వరుస సెట్లలో ఓటమిపాలైంది. 12-21, 23-25 తేడాతో మ్యాచ్‌ను కోల్పోయిన సాత్విక్‌-చిరాగ్‌.. మూడో టైటిల్‌ సాధించాలని పెట్టుకున్న ఆశలను నెరవేర్చుకోలేకపోయారు.

వివరాలు

తొలి సెట్‌లో ఇండోనేషియా ఆధిపత్యం

మ్యాచ్ ప్రారంభం నుంచే ఇండోనేషియా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. వారి వేగం, సమన్వయం ముందు భారత జోడీ తట్టుకోలేకపోయింది. పెద్దగా ప్రతిఘటన లేకుండానే తొలి సెట్‌ను 21-12 తేడాతో లియో రోలీ కర్నాండో - డానియల్ మార్తిన్ సొంతం చేసుకున్నారు. రెండో సెట్‌లో హోరాహోరీ పోరు రెండో సెట్‌లో మాత్రం సాత్విక్‌-చిరాగ్‌ జోడీ గట్టిగా పోరాడింది. ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమిస్తూ చివరి వరకూ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చింది. ఈ సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక దశకు తీసుకెళ్లాలని భారత ద్వయం ప్రయత్నించినా.. ఇండోనేషియా జోడీ కీలక సమయంలో మెరుగైన ఆటతీరు కనబరిచింది. చివరకు 25-23 తేడాతో రెండో సెట్‌ను కూడా గెలుచుకుని టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Advertisement