
Shreyas Iyer: ఐపీఎల్ మెగా వేలం ముందు శ్రేయాస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. 57 బంతుల్లో 130
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేలంలో 577 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ వేడుక రెండు రోజుల పాటు కొనసాగనుంది. వేలానికి ఒక రోజు ముందు భారత క్రికెటర్ కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న అయ్యర్, గోవాతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదు చేశాడు.
కేవలం 47 బంతుల్లో శతకం సాధించిన అయ్యర్, 57 బంతుల్లో 130 పరుగులు చేశాడు.
Details
అయ్యర్ పై విమర్శలు
దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 250 పరుగులు చేసింది. గోవా ఛేదనలో 224 పరుగులకే పరిమితమైంది.
జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన అయ్యర్, ఐపీఎల్ వేలానికి ముందు ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
దేశం కోసం ఏనాడైనా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడావా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్‌లో భారీ సొమ్ము కోసం ఆడుతున్నాడనే విమర్శలు కూడా రావడం గమనార్హం.
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లలో శతకాల మీద శతకాలతో ఆకట్టుకునే అయ్యర్ జాతీయ జట్టులో మాత్రం అదే స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడని విమర్శలు ఉన్నాయి.
Details
రూ.14 కోట్లు పలికే ఛాన్స్
మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అయ్యర్ రాణించే అవకాశం ఉంది.
కాబట్టి వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రూ.14 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకూ అయ్యర్ ధర పలికే ఛాన్స్ ఉందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెంచరీ బాదిన అయ్యర్
#100@105of70Mumbai @Shreyasian96 @ShreyasIyer15 @Rajiv1841 @ShreyasIyer96FC pic.twitter.com/IbGGTKucUJ
— Groom VJ (@Rishabpant7729) November 23, 2024