Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం
ఈ వార్తాకథనం ఏంటి
అక్టోబర్ నెలలో భారత పురుషుల క్రికెట్ జట్టు బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగనుంది. జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలు 2026లో భారత జట్టు పాల్గొననుండగా.. అదే సమయంలో వెస్టిండీస్‌తో మరో భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. రెండు ఈవెంట్ల షెడ్యూల్ ఒకదానితో ఒకటి ఢీకొనడంతో టీమిండియా కీలక ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నారు. ప్రస్తుతం భారత టీ20 జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న శ్రేయాస్.. వన్డే జట్టులోనూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా భారత వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వివరాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్
ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ టోర్నీలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్స్, అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న పతక పోటీలు జరగనున్నాయి. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఇదే సమయంలో అక్టోబర్ 3న భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే న్యూ చండీగఢ్‌లో జరగనుంది.
భారత్ ఆసియా క్రీడల ఫైనల్‌కు చేరుకుంటే.. ఒకే రోజున రెండు వేర్వేరు దేశాల్లో భారత క్రికెట్ జట్లు మ్యాచ్‌లు ఆడినట్లవుతుంది.
వివరాలు
ఆసియా క్రీడల్లో భారత జట్టుకు అయ్యరే కెప్టెన్
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇందుకోసం భారత బృందం త్వరలోనే జపాన్‌కు వెళ్లనుంది.
ఆసియా క్రీడల్లో జట్టును నడిపించాల్సిన బాధ్యత ఉండటంతోనే శ్రేయాస్.. వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు.
శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం భారత వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. 2025 అక్టోబర్‌లో అతడిని ఈ బాధ్యతకు ఎంపిక చేశారు.
అయితే ఆసియా క్రీడల నేపథ్యంలో అతడికి మరో కీలక బాధ్యత అప్పగించడంతో.. వెస్టిండీస్ సిరీస్‌లో టీమిండియాకు అతడి సేవలు అందుబాటులో ఉండవు.
వివరాలు
భారత బృందానికి బీసీసీఐ అధ్యక్షుడి శుభాకాంక్షలు
ఆసియా క్రీడల్లో పాల్గొననున్న భారత క్రీడాకారులకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు.
క్రికెట్ జట్లతో పాటు మొత్తం భారత బృందం అద్భుత ప్రదర్శన చేయాలని ఆయన ఆకాంక్షించారు.
క్రీడాకారులు చేస్తున్న కఠిన సాధన, సన్నద్ధత, ఉత్సాహాన్ని ప్రస్తావించిన మిథున్ మన్హాస్.. ఆసియా క్రీడల్లో భారత్‌కు బంగారు పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.
వివరాలు
2026 ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్ జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.