LOADING...
Team India: సూర్య స్థానంలో శ్రేయస్‌.. భారత జట్టులో కీలక మార్పులు
సూర్య స్థానంలో శ్రేయస్‌.. భారత జట్టులో కీలక మార్పులు

Team India: సూర్య స్థానంలో శ్రేయస్‌.. భారత జట్టులో కీలక మార్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేశారు. ఇప్పటివరకు జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ స్థానంలో అయ్యర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ను నియమించినట్లు వెల్లడించింది. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మకు కీలక బాధ్యతలు అప్పగించింది. అతడిని టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

వివరాలు

వైభవ్ సూర్యవంశీకి అవకాశం

ఇదే సమయంలో యువ ఆటగాళ్లకు కూడా ప్రాధాన్యం కల్పించింది. ప్రిన్స్ యాదవ్‌, వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు కల్పిస్తూ వారి ప్రతిభకు గుర్తింపునిచ్చింది. కొత్త నాయకత్వంతో పాటు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా భవిష్యత్ టీమ్‌ఇండియాను మరింత బలోపేతం చేయాలనే దిశగా సెలక్షన్ కమిటీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ఇదే శ్రేయాస్ అయ్యర్ - కెప్టెన్, తిలక్ వర్మ - వైస్ కెప్టెన్, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చకరవర్తి, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

Advertisement