LOADING...
Shubman Gill: షమీకి టెస్ట్‌ జట్టులో చోటు దక్కపోవడం పై శుభమన్‌ గిల్‌ సంచలన వ్యాఖ్యలు!

Shubman Gill: షమీకి టెస్ట్‌ జట్టులో చోటు దక్కపోవడం పై శుభమన్‌ గిల్‌ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా (Team India) ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన షమీ, మొత్తం ఏడు మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అయితే గాయాల కారణంగా అతను కొంతకాలం క్రితం జట్టులో స్థానం కోల్పోయి, ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ సాధించలేకపోయాడు. చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన షమీ, ఆ సమయంలో ఏడు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు సాధించాడు. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీశాడు కూడా. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లోనూ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

వివరాలు 

షమీ  విషయంపై స్పందించిన  శుభమన్ గిల్‌ 

అయితే, నవంబర్‌ 14 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కు షమీకి చోటు దక్కలేదు. కోల్‌కతాలో జరగనున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ముందు జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్‌ (Shubman Gill) ఈ విషయంపై స్పందించాడు. గిల్‌ మాట్లాడుతూ.. "షమీ భాయ్‌లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. అయినప్పటికీ, ఆకాశ్ దీప్‌, ప్రసిద్ధ్ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మహ్మద్ సిరాజ్‌ (Mohammed Siraj) లాంటి బౌలర్ల ప్రదర్శనను కూడా విస్మరించలేం. రాబోయే టెస్ట్‌ సిరీస్‌లపైనా మా దృష్టి ఉంది. అయితే షమీ ఎంపిక విషయంలో తుది నిర్ణయం సెలెక్టర్లదే," అని వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాతో తలపడటం అంత సులభం కాదని కూడా గిల్‌ అభిప్రాయపడ్డాడు.

వివరాలు 

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానంలో..

"డబ్ల్యూటీసీ (ICC World Test Championship) ఫైనల్‌ దృష్ట్యా ఈ రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు మాకు ఎంతో కీలకం. సౌతాఫ్రికా బలమైన జట్టు, వారు ఛాంపియన్లు. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. పిచ్‌ చాలా బాగుంది — ఇది సాధారణ భారత పిచ్‌లా ఉంటుంది," అని గిల్‌ చెప్పాడు. ఇప్పటివరకు టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మొత్తం ఏడు టెస్ట్‌ సిరీస్‌లు ఆడింది. వాటిలో భారత్‌ ఒక్క సిరీస్‌ను మాత్రమే.. అది కూడా దాదాపు 25 సంవత్సరాల క్రితమే.. కోల్పోయింది. అంతేకాక,గత 15 ఏళ్లుగా దక్షిణాఫ్రికా భారత్‌లో ఒకటైనా టెస్ట్‌ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా 52 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement