Page Loader
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యాక్షన ప్లాన్ ఇదే..!
మొదటి టెస్టుకు సిద్ధమైన టీమిండియా, ఆస్ట్రేలియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యాక్షన ప్లాన్ ఇదే..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2023
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదటి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం భీకరంగా సిద్ధమవుతోంది.‌ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతోంది. ఆస్ట్రేలియా జట్టులో పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్‌ గాయం కారణంగా తప్పుకున్నారు. టీమిండియా నుంచి రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ దూరమయ్యారు. శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్‌తో భర్తీ చేయనున్నారు. శుభ్‌మన్ గిల్‌తో 5వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఓపెనర్లగా రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ , వన్‌డౌన్ పుజారా, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నారు.

టీమిండియా

ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా

5వ స్థానంలో ఎవరిని అడించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నారు. వెస్టిండీస్‌లో మిడిలార్డర్‌లో ఇండియా 'ఎ' తరఫున ఆడిన శుభ్‌మన్ డబుల్ సెంచరీ సాధించాడని, గిల్ స్పిన్ బౌలింగ్ లో బాగా రాణిస్తాడని గాంధీ తెలిపారు. భారత్‌ ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగుతుండగా, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఆర్‌ అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌ ను తీసుకొనే అవకాశం ఉంది అక్షర్ పటేల్ కంటే కుల్దీప్ యాదవ్ మెరుగ్గా రాణిస్తాడని చాలా మంది భావిస్తున్నారు, అయితే జడేజా గాయం నుండి తిరిగి వచ్చి రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. అయితే వికెట్ కీపర్ కోసం ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ మధ్య పోటీ నెలకొంది