
తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగే మొదటి, రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ నాగ్ పూర్ టెస్టుకు దూరమయ్యాడు. తాను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోని మొదటి టెస్టుకు దూరమవుతున్నట్లు హేజిల్ వుడ్ స్వయంగా ప్రకటించారు.
అయితే రెండో టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎడమ కాలి మడమ వద్ద గాయం కారణంగా వైదొలిగనట్లు సమాచారం. మొదటి టెస్ట్ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది.
గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిడ్నీ టెస్టులో జోష్ హెజిల్ వుడ్ గాయపడిన విషయం తెలిసిందే.ఇప్పటికే మిచెల్ స్టార్క్ టెస్టులకు అందుబాటులో లేకపోవడంతో ఆస్ట్రేలియాకు పెద్ద తలనొప్పిగా మారింది.
హేజిల్‌వుడ్
హేజిల్‌వుడ్ స్థానంలో బోలాండ్
మొదటి టెస్టు గురించి ఖచ్చితంగా తెలియదని, ఇంకా కొన్ని రోజుల సమయం ఉందని, రెండు టెస్టు కాస్త ఆలస్యంగా జరగుతుందని, అప్పటికి గాయం నయం మెరుగయ్యే అవకాశం ఉందని జోస్ హేజిల్ వుడ్ పేర్కొన్నారు.
తుది టెస్టులో హేజిల్ వుడ్ స్తానంలో స్కాట్ బోలాండ్ తుదిజట్టులో ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 నుండి ఢిల్లీలో జరగనున్న రెండో టెస్టుకు కూడా హేజిల్‌వుడ్ కోలుకోవడం అనుమానంగానే ఉంది.
2021లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన బోలాండ్ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్‌లో 28 వికెట్లు తీశాడు