LOADING...
Shubman Gill: గిల్‌తో కరచాలనం.. వక్రబుద్ధిని చాటుకున్న పాక్‌ అభిమాని.. వీడియో వైరల్! 
వీడియో వైరల్!

Shubman Gill: గిల్‌తో కరచాలనం.. వక్రబుద్ధిని చాటుకున్న పాక్‌ అభిమాని.. వీడియో వైరల్! 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అడిలైడ్‌లో ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో పాల్గొనడానికి జట్టు అక్కడ పర్యటిస్తోంది. ఈ సమయంలో ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ జరుగుతుండటంతో, కొంతమంది ఆటగాళ్లు అడిలైడ్ నగరంలో చిన్న పర్యటనకు వెళ్లారు. భారత కెప్టెన్ శుభమన్ గిల్ కూడా హర్షిత్ రాణాతో కలిసి బయటకు వెళ్లారు. ఈ సందర్భంలో ఒక క్రికెట్ అభిమానితో ఆయన కరచాలనం చేశారు. అయితే సదరు అభిమాని పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా ఉండటంతో, గిల్‌తో జరిగిన కరచాలన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆ వ్యక్తి "పాకిస్తాన్ జిందాబాద్" అని నినదించడం తీవ్ర చర్చలకు దారితీసింది. నెట్టింట అభిమానిపై విమర్శలు వెల్లువెత్తాయి.

వివరాలు 

ఆ దేశం సాధించిన అతిపెద్ద అచీవ్‌మెంట్

కానీ, టీమిండియా సారథి గిల్ ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగాడు. దీంతో శుభ్‌మన్ గిల్ పై ప్రశంసల వర్షం కురుస్తున్నా, ఆ పాక్ అభిమానిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆసియా కప్ సందర్భంలో భారత క్రికెటర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కనీసం కరచాలనం కూడా చేయలేదు. విజేతగా నిలిచినా, మోసిన్ నఖ్వీ నుంచి టైటిల్‌ను స్వీకరించలేదు. కానీ, ఇప్పుడు ఆ అభిమాని ఎవరనేది చూడకుండా గిల్‌ హుందాగా కరచాలనం చేశాడు. అయితే ఆ అభిమాని వక్రబుద్ధి ప్రదర్శించటంపై భారత క్రికెట్ అభిమానులు విరుచుకుపడ్డారు. కొందరు నెటిజన్లు ఇది ఆ దేశం సాధించిన అతిపెద్ద అచీవ్‌మెంట్‌గా ఎద్దేవా చేస్తూ కామెంట్లు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..