ఇండియన్ క్రికెట్ ని శుభ్‌మన్ గిల్ ఏలుతాడు : మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది టీ20, వన్డే, టెస్టు క్రికెట్ తో పాటు ఐపీఎల్లోనూ సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా గిల్ నిలిచాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచులో గిల్ సెంచరీ చేశాడు. ఏకంగా ఆ మ్యాచులో అతడు 58 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ తన తొలి ఐపీఎల్ సెంచరీని అందుకొని సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో గిల్ పై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ కచ్చితంగా విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అంతటివాడు అవుతాడని రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు.
గిల్ అద్భుతమైన ప్లేయర్
గిల్ అద్భుతమైన ప్లేయర్ ని, అతనితో పాటు యశస్వీ జైస్వాల్ కూడా ఇండియన్ క్రికెట్లో రాణిస్తాడని, వరల్డ్ కప్ తర్వాత భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని రాబిన్ ఉతప్ప తెలియజేశారు. వరల్డ్ కప్ తర్వాత భారీ మార్పులు ఉండొచ్చని, అయితే రాహుల్, రిషబ్ పంత్ ల గాయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. యశస్వీ జైస్వాల్ ను వన్డే వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, సురేష్ రైనా పేర్కొన్నారు.