IPL 2023 : ఆర్సీబీకి 'డూ ఆర్ డై' మ్యాచ్.. నేడు సన్ రైజర్స్తో కీలక మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీకి ఇది డూఆర్ డై మ్యాచ్.. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే కచ్చితంగా మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలిచినా, ఓడినా పోయేదేం లేదు. దీంతో హైదరాబాద్ ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. మరోవైపు బెంగళూర్ కి మాత్రం అసలు సిసలైన కఠిన పరీక్ష ఎదురు కానుంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 22 మ్యాచుల్లో తలపడగా.. ఇందులో హైదరాబాద్ 12 మ్యాచుల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ 9 మ్యాచుల్లో నెగ్గింది.
ఇరు జట్లలోని సభ్యులు
ఆర్సీబీ తరుపున కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు సొంతగడ్డపై జరిగే మ్యాచ్ లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్: అన్మోల్ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రమ్ (సి), హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హాక్ ఫరూఖీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (WK), మైకేల్ బ్రేస్వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్