లేట్ చేయకుండా ఆ ఇద్దరిని టీమిండియాకు ఆడించాలి : బీసీసీఐకి హర్భజన్ సూచన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఐపీఎల్ ద్వారా లభించిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకొని మెరుగ్గా రాణిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జైస్వాల్, కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్ మెన్స్ రింకూ సింగ్ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మ్యాచ్- మ్యాచ్ కు రాటుదేలుతూ ఒంటిచెత్తో జట్టును గెలిపిస్తున్నారు. ఈ సీజన్లో 13 మ్యాచులు ఆడిన జైస్వాల్ 575 పరుగులు చేశాడు. అదే విధంగా రింకూ సింగ్ 507 పరుగులు చేశాడు. ఎలాంటి బౌలర్ అయినా వీరిద్దరూ ధీటుగా ఎదుర్కొన్ని ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియాకు ఈ ఇద్దరిని ఎంపిక చేయాలని బీసీసీఐని టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ సూచించాడు.
రింకూసింగ్, జైస్వాల్ కు జాతీయ జట్టులో అవకాశం కల్పించాలి
రింకూసింగ్, జైస్వాల్ ని జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని హర్భజన్ తెలియజేశారు. ఇదివరకే ఈ ఇద్దరిని టీమిండియాకు తరుపున అవకాశం ఇవ్వాలని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రదర్శన కారణంగానే అజింక్య రహానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అర్హత సాధించాడు. సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చి టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.