ఆర్సీబీ ప్లేయర్లను ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చిన సిరాజ్: ఫోటోలు వైరల్
ఐపీఎల్ లో భాగంగా మే 18వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు ఆర్సీబీ ప్లేయర్లు. ఆర్సీబీలో ఉన్న బౌలర్ మహమ్మద్ సిరాజ్, ఆర్సీబీ ఆటగాళ్ళను తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. ఫిలిమ్ నగర్ లో కొత్తగా కట్టుకున్న ఇంటికి విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, ఇంకా చాలామంది సిరాజ్ ఇంటికి అతిథులుగా వెళ్ళారు. దీనికి సంబంధించిన ఒక వీడియో, ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నిజానికి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ అభిమానులకు తెలిసిపోయింది. దాంతో సిరాజ్ ఇంటివద్ద అభిమానులు గుమి గూడారు.
ముంబై ఆటగాళ్ళను ఇంటికి ఆహ్వానించిన తిలక్ వర్మ
గతంలోనూ ఆర్సీబీ ప్లేయర్లు సిరాజ్ ఇంటికి ఆతిథులుగా వచ్చారు. హైదరాబాద్ బిర్యానీ సహా ప్రత్యేక వంటకాలను ఆరగించారు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కూడా హైదరాబాద్ లో మ్యాచ్ జరిగినపుడు ముంబై ఇండియన్స్ ఆటగాళ్ళందరినీ ఇంటికి ఆహ్వానించాడు. అదలా ఉంచితే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రెడీ ప్లే ఆఫ్స్ నుండి నిష్క్రమించింది. బెంగళూరు మాత్రం ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ రెండు జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.