LOADING...
PV Sindhu: మలేసియా ఓపెన్‌లో సింధుకు నిరాశ.. సెమీస్‌లో ముగిసిన పోరాటం
మలేసియా ఓపెన్‌లో సింధుకు నిరాశ.. సెమీస్‌లో ముగిసిన పోరాటం

PV Sindhu: మలేసియా ఓపెన్‌లో సింధుకు నిరాశ.. సెమీస్‌లో ముగిసిన పోరాటం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పివి.సింధు ప్రయాణం ముగిసింది. సెమీఫైనల్‌ దశలో పరాజయం పాలవడంతో ఆమె ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన చైనా క్రీడాకారిణి వాంగ్‌ జి యి చేతిలో సింధు 16-21, 15-21 గేమ్‌ల తేడాతో ఓటమిని చవిచూసింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన వాంగ్‌ జి యి కీలక క్షణాల్లో పాయింట్లు సాధించి సింధుపై పైచేయి సాధించింది.

Details

 భారత్‌కు మరో ఎదురుదెబ్బ 

ఇదిలా ఉండగా, ఈ టోర్నీలో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి క్వార్టర్‌ ఫైనల్స్‌ దశలోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో మలేసియా ఓపెన్‌లో భారత శిబిరానికి నిరాశే మిగిలింది.

Advertisement