Loading...
Sindhu: వాంగ్‌ తీరుపై సింధు అసంతృప్తి.. రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?
వాంగ్‌ తీరుపై సింధు అసంతృప్తి.. రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

Sindhu: వాంగ్‌ తీరుపై సింధు అసంతృప్తి.. రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 21, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలన్న పీవీ సింధు ఆశలు నెరవేరలేదు. ప్రిక్వార్టర్స్‌లో నంబర్‌-3 సీడ్‌ వాంగ్‌ జి యీ చేతిలో సింధు ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 11-21, 21-15, 17-21 తేడాతో పరాజయం చవిచూసింది. అయితే మ్యాచ్‌ మధ్యలో వాంగ్‌ గాయం పేరుతో పలుమార్లు విరామాలు తీసుకోవడం సింధు ఏకాగ్రతపై ప్రభావం చూపింది. మ్యాచ్‌ అనంతరం తాను మరింత ఓపికగా ఆడాల్సిందని సింధు చెప్పింది. అసలు మ్యాచ్‌లో ఏం జరిగింది? గాయం కారణంగా తీసుకునే విరామాల విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి?

వివరాలు

వాంగ్‌ తీరుపై విమర్శలు..

వాంగ్‌ తీరుపై విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఆమె తీసుకున్న విరామాలే. మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత వాంగ్‌ ఆటను కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నట్లు పెద్దగా కనిపించలేదు.

అయినప్పటికీ గాయం, క్రాంప్స్‌ కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం కలిగింది.

నిబంధనల ప్రకారం అవసరమైన సందర్భాల్లో ర్యాలీల మధ్య వ్యవధిని అంపైర్లు పొడిగించే అవకాశం ఉంటుంది.

అయితే వాంగ్‌ అదనంగా సమయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మెడికల్‌ టైమౌట్‌ విషయంలోనూ వాంగ్‌కు ఎక్కువ సమయం ఇవ్వడంపై చర్చ జరిగింది. అయితే మెడికల్‌ టైమౌట్‌కు ఖచ్చితమైన వ్యవధి ఉండదు.

వివరాలు

మ్యాచ్‌లో ఏం జరిగిందంటే?

సదరు ఆటగాడికి చికిత్స అవసరమని అంపైర్‌ భావిస్తే అదనపు సమయం ఇవ్వొచ్చు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత వాంగ్‌కు నిజంగానే గాయమైందా? లేదా? అనేది తనకు తెలియదని సింధు వ్యాఖ్యానించింది.

అది ఒక వ్యూహం అయి ఉండొచ్చని ఆమె పేర్కొంది. మరోవైపు వాంగ్‌ మాత్రం తాను నిజంగానే ఇబ్బంది పడ్డానని తెలిపింది.

తొలి గేమ్‌ను 11-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకుంది.

ప్రత్యర్థికి పెద్దగా అవకాశమివ్వకుండా 21-15తో గేమ్‌ను సొంతం చేసుకుంది.

దీంతో మ్యాచ్‌ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు చేరింది. అక్కడే అసలు డ్రామా మొదలైంది.

మూడో గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు నువ్వా? నేనా? అన్నట్లుగా పోరాడారు. ఒక దశలో సింధు 8-4తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ADVERTISEMENT

వివరాలు

సింధు, వాంగ్‌ మధ్య ఏకంగా 54 షాట్ల ర్యాలీ..

అదే సమయంలో వాంగ్‌ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడింది. దీంతో ఆమె విరామం తీసుకుంది.

ఆ తర్వాత కూడా సింధు 13-10తో ఆధిక్యంలో ఉన్న సమయంలో వాంగ్‌ మరోసారి ఆటకు విరామం తీసుకుంది.

దీంతో సింధు ఏకాగ్రత దెబ్బతిన్నట్లు కనిపించింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత వాంగ్‌ వరుసగా ఐదు పాయింట్లు సాధించి 15-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అయితే సింధు మళ్లీ పుంజుకుని 16-15తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ పాయింట్‌ కోసం సింధు కొట్టిన షాట్‌ను అందుకునే క్రమంలో వాంగ్‌ తీవ్రంగా ఇబ్బంది పడింది.

దీంతో ఆమె మరోసారి మెడికల్‌ టైమౌట్‌ తీసుకుంది. స్కోరు 17-18గా ఉన్న సమయంలో సింధు, వాంగ్‌ మధ్య ఏకంగా 54 షాట్ల ర్యాలీ జరిగింది.

ADVERTISEMENT

వివరాలు

దాదాపు 88 నిమిషాల పాటు పోరు..

చివరికి ఆ పాయింట్‌ను వాంగ్‌ గెలుచుకుంది. ఆ తర్వాత వాంగ్‌కు మరోసారి కాళ్లలో తిమ్మిరి వచ్చినట్లు కనిపించడంతో ఆమె మళ్లీ విరామం తీసుకుంది.

ఈ ఆలస్యం మ్యాచ్‌ గమనాన్ని మార్చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విరామం తర్వాత వాంగ్‌ వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

దాదాపు 88 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. సింధు దూకుడుకు వాంగ్‌ వరుస విరామాలతో అడ్డుకట్ట వేసిందనే విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT