PV Sindhu: ఫ్రెంచ్ ఓపెన్‌లో సింధు జోరు.. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన స్టార్ షట్లర్!
ఈ వార్తాకథనం ఏంటి
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. అద్భుత ఆటతీరుతో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21-12, 21-16తో జపాన్ షట్లర్ రికో గుంజిపై ఘన విజయం సాధించింది. కేవలం 44 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించి తదుపరి దశకు దూసుకెళ్లింది.
వివరాలు
యమగూచికి అస్మిత షాక్!
మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ అస్మిత చాలిహా సంచలన విజయం సాధించింది. మూడో సీడ్, జపాన్ స్టార్ యమగూచితో జరిగిన మ్యాచ్‌లో అస్మిత అద్భుతంగా ఆడింది.
21-19, 21-18తో వరుస గేముల్లో ప్రత్యర్థిని ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే భారత యువ షట్లర్ తన్వి శర్మకు నిరాశ ఎదురైంది.
ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సియాంగ్‌తో జరిగిన పోరులో ఆమె ఓటమి పాలైంది. 11-21, 14-21తో దక్షిణ కొరియా షట్లర్ చేతిలో పరాజయం చవిచూసింది.
వివరాలు
గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగిన ఆయుష్
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత ఆటగాడు ఆయుష్‌కు గాయం అడ్డంకిగా మారింది.
జపాన్ షట్లర్ కొడై నరాఒకతో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ 17-21, 6-21తో వెనుకంజలో ఉన్న సమయంలో గాయపడ్డాడు.
దీంతో మ్యాచ్‌ను కొనసాగించలేకపోయాడు. ఫలితంగా కొడై నరాఒక తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.