Page Loader
ENG vs IND: సిరాజ్‌ బౌలింగ్‌ స్టైల్‌ మారింది.. సచిన్ ప్రశంసలు
సిరాజ్‌ బౌలింగ్‌ స్టైల్‌ మారింది.. సచిన్ ప్రశంసలు

ENG vs IND: సిరాజ్‌ బౌలింగ్‌ స్టైల్‌ మారింది.. సచిన్ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ మెరుగైన ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ 6 వికెట్లు(6/70)తీసి ఇంగ్లాండ్‌ను ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. స్టార్ బౌలర్ బుమ్రా లేకపోయినా.. యువ పేసర్ ఆకాశ్‌ దీప్‌తో కలిసి సిరాజ్ చక్కటి గేమ్‌ ప్రదర్శించాడు. సిరాజ్‌కు ఇది ఇంగ్లాండ్‌లో తొలి ఆరు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

Details

బ్రూక్ - స్మిత్ మధ్య భాగస్వామ్యం కీలకం

సిరాజ్‌ బౌలింగ్‌లో నేను గమనించిన అత్యంత ముఖ్యమైన మార్పు, బంతిని సరైన లెంగ్త్‌లో, విసరడం గొప్ప విషయం. అదే కారణంగా అద్భుతమైన ఫలితం వచ్చిందని నేను భావిస్తున్నా. ఆకాశ్‌ దీప్‌ నుంచి వచ్చిన సహకారం కూడా కీలకం. ఇద్దరూ చక్కగా బౌలింగ్‌ చేశారు. బ్రూక్ - స్మిత్ మద్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. ఒత్తిడిలోనూ వారు దూకుడుగా ఆడారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు దగ్గరయ్యేందుకు వారు ప్రయత్నించారని సచిన్‌ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ పరిస్థితులపై ఇంగ్లాండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్పందించాడు.

Details

భారత్ మాకంటే ముందంజలో ఉంది

ప్రస్తుతం భారత్ మాకంటే కొంచెం ముందంజలో ఉంది. నాలుగో రోజు తొందరగా రెండు వికెట్లు తీస్తే మేమూ గేమ్‌లోకి రావచ్చు. మ్యాచ్ ఎలా తిరుగుతుంది ఎవరూ ఊహించలేరు. హెడింగ్లే టెస్టులో భారత్ లోయర్ ఆర్డర్‌ను తొందరగా ఔట్ చేశాం. కానీ ఈసారి మేమే ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. భారత్ ఎంత లక్ష్యాన్ని నిర్ధేశించినా సరే, మేం దానిని ఛేదించేందుకు ప్రయత్నిస్తాం. ఇవాళ మాకు చాలా కీలకమైన టాస్క్ ఎదురవుతోందని వ్యాఖ్యానించాడు.