Smriti Mandhana: అతి త్వరలోనే స్మృతి, పలాశ్ వివాహం... క్లారిటీ ఇచ్చేసిన పలాశ్ తల్లి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం నిరవధికంగా వాయిదా పడింది. ఈ వివాహం నవంబర్ 23న జరగాల్సినది. అయితే అదే రోజు కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటు లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఈ కారణంగా స్మృతి మంధాన తన వివాహాన్ని కొనసాగించలేనని, అందుకే వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఆమె మేనేజర్ తెలిపారు. తరువాత కాబోయే వరుడు పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురై సాంగ్లీలోని ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయినప్పటికీ, తిరిగి ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు.
Details
అనారోగ్యానికి గురైన పలాశ్
వైద్యుల ప్రకారం, ఒత్తిడి, యాంగ్జైటీ కారణంగా పలాశ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఆక్సిజన్ థెరపీ అందించబడింది. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అంతకుముందు, స్మృతి మంధాన తండ్రి కొన్ని రోజుల చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నారు. అయితే స్మృతి మంధాన వైపు నుండి వివాహానికి సంబంధించిన తాజా అప్‌డేట్ అందలేదు. ఇక తాజాగా పలాశ్ తల్లి అమిత ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయని, త్వరలో వివాహం జరగనుందని తెలిపారు. స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఇద్దరూ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. పలాశ్ తన కలలను సాకారం చేసుకొని, స్మృతిని అర్ధాంగిగా ఇంటికి తీసుకురావాలని కోరుకున్నాడు.
Details
త్వరలోనే వివాహం జరుగుతుంది
నేను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది. వారిద్దరి వివాహం త్వరలో జరుగుతుంది. అయితే, స్మృతి మంధాన తన వివాహం సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించడం, పలు ఊహాగానాలకు కారణమైంది. అదేవిధంగా పలాశ్ ముచ్చల్ మరొక మహిళతో చాట్ చేసి స్మృతిని కించపరుస్తున్నట్లు స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని కారణంగా పలు రూమర్లు వ్యాప్తి చెందాయి. ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించినట్లు, వివాహం వాయిదా పడడానికి ప్రధాన కారణం స్మృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం. అయితే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేరే రూమర్లపై ఇంతవరకూ స్పందించలేదు.