Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లికి బ్రేక్.. కారణం ఏమిటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం అకస్మాత్తుగా వాయిదా పడింది. నవంబర్ 23 (ఆదివారం) మహారాష్ట్రలోని సాంగ్లిలో జరగాల్సిన ఈ వివాహం ముందే స్మృతి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురయ్యారు. పలు నివేదికల ప్రకారం, పెళ్లి ఇంటికి అనూహ్యంగా అంబులెన్స్ రావడంతో అందరూ కలవరపడ్డారు. స్మృతి తండ్రిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, స్మృతి తన వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. కొన్ని రోజులుగా సాంగ్లిలోని స్మృతి మంధాన కొత్త ఇంట్లో వివాహ వేడుకలు జరుగుతుండగా, నవంబర్ 23వ తేదీ సాయంత్రం 4:30 గంటల సమయంలో వివాహం జరగాల్సి ఉంది.
Details
వాహం నిరవధికంగా వాయిదా
కానీ పెళ్లికూతురు తండ్రి అనారోగ్యంతో ఆహ్లాదకర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా ఈ ఘటనపై స్పందిస్తూ, "శ్రీనివాస్ మంధాన ఈ రోజు ఉదయం అల్పాహారం తీసుకుంటుండగా ఆరోగ్యం క్షీణించింది. మొదట ఆయన కోలుకుంటారని భావించాం, అందుకే కొంతసేపు గమనించాం. కానీ తరువాత పరిస్థితి దిగజారడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. స్మృతి తన తండ్రికి చాలా దగ్గర. ఆయన పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి చేసుకోకూడదని ఆమె నిర్ణయించుకుందని వెల్లడించారు. శ్రీనివాస్ మంధాన ఆరోగ్యాన్ని వైద్యులు దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల వివాహం నిరవధికంగా వాయిదా పడింది. మంధాన కుటుంబం గోప్యతను గౌరవించాలని మనవి చేస్తున్నామని తెలిపారు.