
Smriti Mandhana: స్మృతి మంధాన సెన్సేషన్..కోహ్లీ రికార్డు బద్దలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచి సరికొత్త చరిత్ర రాసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న రికార్డును ఆమె తిరగరాసింది. ఈ రికార్డును ఆమె విశాఖపట్నంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లో బద్దలుకొట్టింది.
Details
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన మంధాన
ఆస్ట్రేలియాపై ఈ మ్యాచ్‌లో 80 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మంధాన, కేవలం 112 ఇన్నింగ్స్‌లోనే 5,000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది (114 ఇన్నింగ్స్). పురుషుల-మహిళల క్రికెట్ కలిపి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్‌ను వేగంగా అందుకున్న ఆటగాళ్లలో మంధాన మూడో స్థానంలో ఉంది. ఆమె కంటే ముందున్నవారు: బాబర్ ఆజం (97 ఇన్నింగ్స్) హషీమ్ ఆమ్లా (101 ఇన్నింగ్స్)
Details
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మరో రికార్డు
ఈ మ్యాచ్‌లో మంధాన మరో అరుదైన రికార్డును కూడా క్రెడిట్ చేసుకుంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 1997లో ఆస్ట్రేలియా ఆటగాళి బెల్లెండా క్లార్క్ సాధించిన 970 పరుగుల రికార్డును మంధాన అధిగమించారు. ఆసీస్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ వేసిన ఒకే ఓవర్‌లో ఫోర్, సిక్స్, ఫోర్‌తో 16 పరుగులు తీసి ఈ ఘనత సాధించింది.
Details
ఆస్ట్రేలియాపై చెలరేగిన మంధాన
టోర్నమెంట్‌లో ముందటి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమైన మంధాన, ఆస్ట్రేలియాపై మాత్రం అసాధారణగా ఆడింది. మైదానం నాలుమూలలా ఆకర్షణీయమైన స్ట్రోక్‌లతో ఆసీస్ బౌలర్లను చిత్తు చేసి పూర్తి ఆధిపత్యం చాటింది. మహిళల క్రికెట్‌లో 5,000 పరుగుల మైలురాయిని వేగంగా చేరుకున్న వారిలో ఆమె ప్రథమ స్థానంలో ఉంది: 1. స్మృతి మంధాన - 112 ఇన్నింగ్స్ 2. స్టెఫానీ టేలర్ - 129 ఇన్నింగ్స్ 3. సుజీ బేట్స్ - 136 ఇన్నింగ్స్ 4. మిథాలీ రాజ్ - 144 ఇన్నింగ్స్