LOADING...
T20 World Cup: యూఏఈపై దక్షిణాఫ్రికా ఘనవిజయం
యూఏఈపై దక్షిణాఫ్రికా ఘనవిజయం

T20 World Cup: యూఏఈపై దక్షిణాఫ్రికా ఘనవిజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశను దక్షిణాఫ్రికా అజేయంగా ముగించింది. సూపర్‌-8 దశకు చేరుకునే ముందు ఆ జట్టు మరో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన గ్రూప్‌-డి పోరులో మార్‌క్రమ్‌ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్ల తేడాతో యూఏఈపై ఆధిపత్యం చాటింది. పేసర్లు కార్బిన్‌ బోష్‌ (3/12), నోకియా (2/28) విజృంభించడంతో మొదట యూఏఈ 20 ఓవర్లలో 122/6కే పరిమితమైంది. అలీషన్‌ షరాఫు 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 45 పరుగులు చేసి పోరాడగా, కెప్టెన్‌ మహ్మద్‌ వసీమ్‌ 12 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు.

వివరాలు 

న్యూజిలాండ్‌ కూడా 6 పాయింట్లతో సూపర్‌-8కు..

చేసింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు.డెవాల్డ్‌ బ్రెవిస్‌ 25 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లతో 36 పరుగులు చేయగా,రికెల్టన్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులు సాధించాడు. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ కేవలం 11 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పటికే సూపర్‌-8కు అర్హత సాధించిన సఫారీ జట్టు లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. మరోవైపు యూఏఈ, కెనడాపై ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి టోర్నీని ముగించింది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్‌ కూడా 6 పాయింట్లతో సూపర్‌-8కు చేరుకుంది.

వివరాలు 

బ్రెవిస్‌, రికెల్టన్‌ దూకుడు

భారత్‌తో ఆదివారం సూపర్‌-8 మ్యాచ్‌ ఉండడంతో, ఈ మ్యాచ్‌ ప్రాధాన్యం తక్కువగా ఉండటంతో లుంగి ఎంగిడి, మార్కో యాన్సెన్‌లకు విశ్రాంతి ఇచ్చారు. నోకియాను మాత్రం ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దించారు. యూఏఈకి పరుగులు సాధించడం కష్టంగా మారిన అదే పిచ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటర్లు ధైర్యంగా ఆడారు. ఓపెనర్లు మార్‌క్రమ్‌, డికాక్‌ (14) 2.5 ఓవర్లలో 32 పరుగులు జోడించి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా మార్‌క్రమ్‌ ఆక్రమణాత్మకంగా ఆడాడు. హైదర్‌ అలీ వేసిన మూడో ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది వేగాన్ని పెంచాడు. అయితే అదే ఓవర్లో చివరి బంతికి అతడు ఔటయ్యాడు. కొద్దిసేపు మెరుపులు చూపిన డికాక్‌ కూడా మరుసటి ఓవర్లో వెనుదిరిగాడు.

Advertisement

వివరాలు 

కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన సఫారీలు 

ఈ పరిస్థితిలో బ్రెవిస్‌, రికెల్టన్‌ జట్టు పరుగుల వేగాన్ని తగ్గనివ్వలేదు.8వ ఓవర్లో బ్రెవిస్‌ ఒక సిక్స్‌,ఒక ఫోర్‌ బాది దూకుడు చూపగా,10వ ఓవర్లో రికెల్టన్‌ రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా వైపు మళ్లించాడు. విజయం సమీపించిన దశలో ఈ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా,స్టబ్స్‌ (6 నాటౌట్‌),జేసన్‌ స్మిత్‌ (3 నాటౌట్‌) మిగతా పనిని పూర్తి చేశారు. ఇందుకు ముందు యూఏఈ ఇన్నింగ్స్‌ ఆరంభం కాస్త మెరుగ్గా సాగింది.4.2ఓవర్లకు 38పరుగుల వద్ద వికెట్‌ కోల్పోకుండా నిలిచింది. అయితే కొద్దిసేపటికే ఓపెనర్లు మహ్మద్‌ వసీమ్‌,ఆర్యాంశ్‌(13)వరుసగా ఔటవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఒక వైపు అలీషన్‌ షరాఫు నిలబడినా,అతనికి తగిన మద్దతు దొరకలేదు. బోష్‌,నోకియా,లిండ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో యూఏఈ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు.

Advertisement

వివరాలు 

సంక్షిప్త స్కోర్లు

యూఏఈ: 122/6 (షరాఫు 45, వసీమ్‌ 22; బోష్‌ 3/12, నోకియా 2/28, లిండ్‌ 1/17) దక్షిణాఫ్రికా: 13.2 ఓవర్లలో 123/4 (బ్రెవిస్‌ 36, రికెల్టన్‌ 30, మార్‌క్రమ్‌ 28)

Advertisement